వ్యాక్సిన్ వల్ల కలిగే ఉపయోగాలు ప్రజలకు తెలియజేయాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 21: వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే ఉపయోగాలు ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం జనగామ మండలం చీటకోడూరు సబ్ సెంటర్ లో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు రెండవ డోసు తీసుకోని వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టాలని కలెక్టర్ అన్నారు. వ్యాక్సిన్ పై ఇంకా అవగాహన లేని వారు వ్యాక్సిన్ తీసుకొనుటకు బయపడుతున్నందున వారికి వైద్య సిబ్బంది, గ్రామ స్థాయిలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, కమ్యునిటీ హెల్త్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు, గ్రామ పంచాయతీ సిబ్బంది మొదలగు వారు సర్వే చేసి వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే ఫలితాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని కలెక్టర్ అన్నారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎ. మహేందర్, తదితరులు ఉన్నారు.
—————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post