శంకర్ భవన్ స్కూల్ లో మరమ్మతులు పరిశీలించిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
శంకర్ భవన్ స్కూల్లో సందర్శించి మరమ్మతులను పరిశీలించారు.

స్థానిక కోట గల్లీలో గల శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరమ్మతులు జరుగుతున్నందున శుక్రవారం ఆయన పర్యటించి రిపేరు చేసిన క్లాస్ రూమ్స్ పరిశీలించారు.
విద్యార్థులకు అందుబాటులో అభివృద్ధి చేసే దిశగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి
సి డి ఎఫ్ నిధుల నుంచి 6 గదులు జే ఐ సి షీట్లు వేయడంతో పాటు, క్లాస్ రూమ్ లకు ఫ్యాన్స్ సమకూర్చి, మూడు వాటర్ ట్యాంక్స్ మంచినీటి కోసం ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్స్ ర్యాంపు, టాయిలెట్స్ ఇతర మరమ్మతులు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ కాంపౌండ్ ఎత్తు పెంచి విద్యార్థులకు రక్షణగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంబడి డీఈఓ దుర్గాప్రసాద్, పాఠశాల టీచర్స్ ఉన్నారు

Share This Post