శనివారం కలెక్టర్ కార్యాలయంలో నీతి అయోగ్ అండర్ సెక్రెటరీ అజయ్ జోషి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ను కలిసి జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై చర్చించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 2 (శనివారం).

శనివారం కలెక్టర్ కార్యాలయంలో నీతి అయోగ్ అండర్ సెక్రెటరీ అజయ్ జోషి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ను కలిసి జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన జిల్లాగా నీతి అయోగ్ చే ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్తించబడి వివిధ కంపెనీల సామాజిక అభివృద్ధి నిధులతో జిల్లాలో పేద ప్రజల అభివృద్ధి కొరకు ముఖ్యంగా వైద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, పౌష్టికాహార కల్పన తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. అనంతరం నీతి అయోగ్ అండర్ సెక్రటరీ జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో నీతి అయోగ్ సహకారంతో సమకూర్చిన పరికరాలు, న్యూట్రిషన్ బిల్డింగ్, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పిహెచ్సిలు, పాఠశాల భవనాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, డిఆర్డిఓ పురుషోత్తం, సిపిఓ శామ్యూల్, డిపిఓ ఆశాలత, జెడ్పి సిఇఓ శోభారాణి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. శ్రీరామ్, డిపిఆర్ఓ రవి కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ హేమలత, నీతి అయోగ్ జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post