శనివారం కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత  సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

.  నిరుద్యోగ యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పనకు పేరొందిన 36  ప్రైవేట్  కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు.  ఎనిమిదవ తరగతి  నుండి డిగ్రీ, డిప్లొమో, పీజీ, సీఏ,   ఇంజనీరింగ్,  ఎంబీఏ,  ఎంసీఏ,  ఐ టి ఐ చేసిన అభ్యర్థులకు వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందని ఆయన చెప్పారు. జాబ్ మేళాకు అధిక సంఖ్యలో యువత వచ్చే అవకాశం ఉన్నందున లోటు పాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పైన పేర్కొన్న విద్యార్హతలుండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయో డేటాతో పాటు విద్యార్హతల జిరాక్స్ ప్రతులను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఎంపిక అయిన అభ్యర్థులకు వారి వారి అర్హతలను బట్టి   వేతనం లభించనున్నట్లు ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు   పేరు గాంచిన కంపనిలు  ముందుకు రావడం చాలా సంతోషమని చెప్పారు.

 

Share This Post