శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ఎల్.బి.నగర్, మాల్ మైసమ్మ దగ్గర జరుగుతున్న ఫ్లై ఓవర్ పనులను, నాగోల్ డివిజన్ పరిధిలోని దేవకి ఫంక్షన్ హాల్ దగ్గర జరుగుతున్న బాక్స్ డ్రైన్స్ పనులను పరిశీలించారు.

శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ఎల్.బి.నగర్, మాల్ మైసమ్మ దగ్గర జరుగుతున్న ఫ్లై ఓవర్ పనులను, నాగోల్ డివిజన్ పరిధిలోని దేవకి ఫంక్షన్ హాల్ దగ్గర జరుగుతున్న బాక్స్ డ్రైన్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరుపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. బాక్స్ డ్రైన్స్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. వచ్చే వర్షాకాలం వరకు బాక్స్ డ్రైన్స్ పనులు పూర్తి చేయాలని కోరారు. ఇట్టి పనులు పూర్తి అయితే కాలనీ వాసులకు ముంపు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని తెలిపారు. అలాగే ఎల్.బి.నగర్ దగ్గర ఫ్లై ఓవర్ పనులు పూర్తి అయితే వాహనదారులు సాఫీగా ప్రయాణం చేయవచ్చు అని తెలిపారు.
అనంతరం నాగోల్ డివిజన్ పరిధిలోని ఫతుళ్ళగూడ నందు ఆరు ఎకరాల స్థలంలో రూ.21 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్థుల కోసం వేరు వేరుగా శ్మశానవాటికలను ఒకే చోట నిర్మిస్తున్నామని తెలిపారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న మహాప్రస్థానంలోని మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మహాప్రస్థానంలో విశాలమైన హాల్‌తో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. పచ్చని పర్యావరణాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావారణం కల్పించేందుకు అందమైన పూల చెట్లు పెంచడం, పచ్చదనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన వాటికకు వచ్చే ప్రజల అవసరాల కోసం వాడే నీరు వృదాకాకుండా అట్టి నీరు మొక్కలకు పోయే విధంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. శ్మశానవాటికకు అవసరం అయ్యే కరెంటు కూడా పక్కనే ఉన్న అనిమల్ కేర్ సెంటర్ మీద పెద్ద సోలార్ సిస్టం ఎర్పాటు చేయడం జరుగుతుందని, దాని ద్వారా వచ్చే కరెంట్ స్మశానవాటికలో వాడుకోవచ్చు అని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డి, ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ పంకజ, డిప్యూటి కమిషనర్లు సురేందర్ రెడ్డి, మారుతి.దివాకర్,జోనల్ సిటీ ప్లానర్ ప్రసాద్ రావు,ఎస్.ఈ.అశోక్ రెడ్డి,ఎస్.ఈ.ప్రాజెక్ట్స్ రవీందర్ రాజు,ఈ.ఈ.ప్రాజెక్ట్స్ రోహిణి,ఈ.ఈ.కోటేశ్వరరావు నాయకులు ఆనంతుల.రాజిరెడ్డి,చిరంజీవి,గుంటి.లక్ష్మణ్, సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Share This Post