శనివారం లోగా హరిత హారం లక్ష్యం పూర్తి చేయాలి —జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

శనివారం లోగా హరిత హారం లక్ష్యం పూర్తి చేయాలి —జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-17 :

హరిత హారం లక్ష్యాన్ని శనివారం  లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజ్ఞ సమావేశ మందిరంలో హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, జియో టాగింగ్, మల్టీ లేయర్ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనం, డ్రయింగ్ ప్లాట్ ఫామ్ అంశాలపై ఎం.పిడి.ఓలు, మండల స్పెషల్ ఆఫిసర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. 

వర్షాలు ఎక్కువగా పడుతున్నందున మొక్కలను ఈ వారంలో నాటినట్లైతే ఎదుగుదలకు సహాయంగా ఉంటుందని తెలిపారు.నాటిన ప్రతి మొక్క భద్రత చూడాలనీ, నాటిన మొక్కల మనుగడను పర్యవేక్షించి మొక్క ఎదుగుదలకు కృషి చేయాలని అన్నారు. జియో టాగింగ్ చేసి చెల్లింపులు వెంటనే చేయాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్, హరిత హారం ప్లాంటేషన్ కొరకు కూలీ లు దొరకటం లేదని కారణాలు చెప్పవద్దని, వెంటనే హరితహారం లక్ష్యం పూర్తి చేయాలని తెలిపారు. మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేయాలని తెలిపారు.

ఆగస్ట్ మాసంలో Parameters ప్రకారం బయ్యారం ఎం.పిడి.ఓ మొదటి స్థానంలో, గంగారాం రెండవ, చిన గుడుర్ మూడవ స్థానంలో ఉండగా చివరి స్థానంలో తొర్రూరు 16 స్థానంలో ఉన్నదని, వెంటనే తమ లక్ష్యాలను పూర్తి చేసి తమ ranking ను మెరుగు పర్చుకోవలని తెలిపారు. Ranking లో మెరుగైన స్థానంలో వున్న మండల అధికారులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.పర్యవేక్షణ ను ఎప్పటికప్పుడు చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలకు విద్యుత్, బోర్, ఇతర సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఖచ్చితంగా మూడు ఫీట్ ల మొక్కలను కాకుండా రెండున్నర ఫీట్లు ఉన్న మొక్కలను కూడా నాటాలని సూచించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈఓ టి.రమాదేవి, డిఆర్డిఓ సన్యాసయ్య,  జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఎం .పి.డి.ఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు. తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post