నేడు, రేపు (శని, ఆదివారం) లలో తిరిగి డిసెంబర్ 3,4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ 26,27 తదుపరి డిసెంబర్ 3,4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడి పేరును ఓటరు గా నమోదు చేయాలనీ అన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రతి బూతు స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా హాజరై వారి పరిధిలోని అర్హత గల వ్యక్తులను ఓటర్ గా నమోదు చేయాలనీ అన్నారు. 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులను గుర్తించి గరుడ యాప్ లేదా ఫారం -6 ద్వారా ఓటరు గా నమోదు చేయాలని, ఇందుకు గాను బిఏల్ఓ లు ఇంటింటికి తిరిగి గుర్తించి నమోదు చేయాలనీ అన్నారు. అదేవిధంగా ట్రాన్స్ జెండర్స్, సెక్స్ వర్కర్లు, దివ్యంగులు, కొత్తగా వివాహం చేసుకున్న మహిళలను గుర్తించి వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని అన్నారు. మాజీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్య సభ, లోక సభ సభ్యులు, సర్పంచ్ లు, ఇతర ముఖ్యులు, ప్రముఖుల పేర్లను ఓటర్ జాబితాలో వదలి పెట్టకుండా తప్పని సరిగా నమోదు చేయాలని అన్నారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లను గుర్తించి సదరం డేటా ద్వారా వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయాలని ,అలాగే ఇంతకుముందు జాబితాలో ఉన్న వారిని, కొత్తగా నమోదు అయిన వారిని సైతం మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ రేఖాంక్షలు, (లాంగిట్యూడ్), అక్షంశాలు (లాటిట్యూడ్స్) గా తప్పనిసరిగా క్యాప్చర్ చేయాలని, సూపర్వైజర్లు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్లు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి నియోజక వర్గ ఎన్నికల అధికారికి నివేదికలు సమర్పించాలని తెలిపారు. అలాగే ఈఆర్ఓ వారి పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని అంశాలతో అర్హత ఉన్న వారందరూ ఓటరు జాబితాలో నమోదైనది, లేనిది పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.
You Are Here:
Home
→ శని, ఆదివారాలు, డిసెంబర్ 3,4 తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు:జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPROADB-ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలి.. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేయండి- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
-
DPROADB-రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు పకడ్బందీగా నిర్వహించాం- ఆర్డీఓ రమేష్ రాథోడ్.
-
DPROADB- కంటి వెలుగు కార్యక్రమంపై గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించి అడల్ట్ ప్రజలందరూ పరీక్ష చేయించుకునే విధంగా ప్రోత్సహించాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPROADB- అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.