శని ఆదివారాలు ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాల నిర్వహణ:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్థం…….1

తేదీ.25.11.2022

జయశంకర్ భూపాలపల్లి , నవంబర్ 25:-

జిల్లాలో ఉన్న 317 పోలింగ్ కేంద్రాల పరిధిలో శని ఆదివారాలు ( నవంబర్ 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో) ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేశామని, ప్రస్తుతంజిల్లాలో 317 పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులను నియమించమని, వారి వద్ద డ్రాఫ్ట్ ఓటరు జాబితా అందుబాటులో ఉన్నాయని,, వాటిలో గల అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. ప్రతి బూత్ స్థాయి అధికారి వద్ద నూతన ఫారం లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో 3,60,573 జనాభా ఉందని , వాటిలో 2,56,351 మందికి ఓటు హక్కు కల్పిస్తూ జాబితా డ్రాఫ్ట్ సిద్ధం చేశామని, వీటిలో 1,28,746 మంది పురుషులు,1,27,601 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 990 మంది నూతన ఓటర్లను గుర్తించి నమోదు చేశామని అన్నారు. ఓటరు జాబితాలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన ఓటరు వివరాలు, మించిన వారు వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్ కు సంబంధించి దరఖాస్తులను నవంబర్ 9 నుంచి డిసెంబర్ 8 వరకు ఆన్ లైన్ లో , లేదా బూత్ స్థాయి అధికారికి, తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

శని ఆదివారాలలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయ అధికారి ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటారని, ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితా నమోదయ్య విధంగా చర్యలు తీసుకుంటారని వారికి ప్రజల సైతం తమ సంపూర్ణ సహకారం అందించి తమ పేర్లు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రస్తుతం 1 జనవరి 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందించేలా జాబితా సిద్ధం చేస్తున్నామని, ప్రతి 3 నెలలకు నూతన ఓటర్లను జాబితాలో చేర్చడం జరుగుతుందని అన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post