శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఉప ఎన్నిక నిర్వహించాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేయాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్

ఈనెల 30న జరగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ లు, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి తో ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్ తో పాటు,హెల్త్ డెస్కులు ఉండేలా చూడాలని అన్నారు. అన్ని సౌకర్యాలు ఉండాలని, వీల్ చైర్ లు, మంచినీరు,విద్యుత్ ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించాలని తెలిపారు.

హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ పోలింగ్ కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం సమాప్తం అయిందని, పొలిటికల్ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని , నియోజకవర్గానికి సంబంధం లేని వారు బయటికి వెళ్లేటట్లు చర్యలు తీసుకున్నామని అన్నారు. అందరికీ పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగిందని, పోలింగ్ రోజు ఉదయము మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో క్లియర్ చేసి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్ని కను శాంతియుతంగా స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.
పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ ఉప ఎన్నికకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. వోటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నివారించేందుకు విజిలెన్స్ టీంలు పని చేస్తున్నాయని తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి, డిసిపి పుష్పా, డిఎం అండ్ హెచ్ ఓ లలితాదేవి, ఆర్డిఓ వాసుచంద్ర, ఎల్డిఎం మురళీమోహన్ రావు,ఎన్నికల సూపరింటెండెంట్ రాణి, డిటీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post