శాంతి యుతంగా పోరాడి గాంధీ స్వతంత్రం తీసికోచ్చారు… MLA రాజేందర్ రెడ్డి

శాంతి యుతంగా పోరాడి గాంధీ స్వతంత్రం తీసికోచ్చారు… MLA రాజేందర్ రెడ్డి

జాతిపిత మహాత్మా గాంధీ శాంతియుతంగా పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారని ఫ్రీడమ్ రన్ సందర్బంగా నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా గురువారం పోలీస్ పరైడ్ గ్రౌండ్ నుండి నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి ఎస్పీ. శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు తో కలిసి జండా ఊపి ఫ్రీడమ్ రాన్ ను ప్రారంభించారు.  శాసన సభ్యులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలము స్వతంత్రం అని అన్నారు.  ఈ నెల 22వ తేది వరకు వజ్రోత్సవాలను జరుపుకోవలన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అగుచున్న ఈ సందర్భంలో స్వాతంత్య్రం కొరకు పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాయన్నారు.  యువత చాడు వ్యసనాలకు దూరంగా ఉండి ప్రతి రోజు వ్యాయామం చేయాలని మరియు చరిత్రను తెలుసువలసిన భాద్యత యువతకు ఎంతైనా అవసరం ఉందని జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు  పేర్కొన్నారు. ఫ్రీడమ్ రన్ పోలీస్ పరైడ్ గ్రౌండ్ నుండి విరసవర్కర్ చౌరస్తా మీదుగా సమరయోధులు పేర్ల నినాదాలతో , శాసన సభ్యులు, ఎస్పీ  అందరికంటే ముందు  పరిగెడుతూ ఉత్సాహంగా భారత్ మాతా కి జై అని   యువత, విద్యార్థుల్లో జోష్ నింపుతూ  విద్యార్థులు జాతీయ జండాలను చేతపట్టుకొని సత్యనారాయణ చౌరస్తా అంబేత్కర్ చౌరస్తా  కు చేరుకొని రన్ ను  ముగించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పద్మజ రాణి, ఆర్డీఓ రామచందర్ నాయక్, డిఎస్పీ  సత్యనారాయణ , జిల్లా అధికారులు  మున్సిపల్ కమిషనర్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, సిఐ శ్రీకాంత్ రెడ్డి, RI లు రాఘవరావు, కృష్ణయ్య, ఎస్సైలు సురేష్,రమేష్ వసంత, సుధా మాధురి, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post