శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లు అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 18:

శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లు అన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని గురువారం నిర్వహించిన ఫ్రీడం కప్ ఆటల ఫైనల్ పోటీల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వివిధ ఆటల్లో పోటీలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డి, ఖో ఖో, అథ్లెలేటిక్స్,షటిల్, బాల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, లేమన్ స్పూన్ తదితర ఆటల్లో 29 శాఖల నుండి 900 కు పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్, సిపి లు క్రికెట్, టగ్ ఆఫ్ వార్ లో స్వయంగా పాల్గొని క్రీడలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయని అన్నారు. క్రీడలతో స్నేహాభావం పెంపొందుతుందని వారు అన్నారు. ఎప్పుడూ పని ఒత్తిడిలో గడుపుతున్న ఉద్యోగులకు ఇట్టి కార్యక్రమాలు ఉత్తేజాన్ని ఇస్తామని వారు తెలిపారు. క్రీడలతో మానసికంగా ధృడంగా తయారవుతారని వారు అన్నారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. క్రికెట్ లో పోలీస్ టీమ్ విన్నర్, పిహెచ్ సి డాక్టర్లు రన్నరప్ గా, కబడ్డీ లో పోలీస్ టీమ్ విన్నర్, మార్కెటింగ్ శాఖ రన్నరప్ గా, టగ్ ఆఫ్ వార్ లో పోలీస్ టీమ్ విన్నర్, ఎక్సైజ్ శాఖ టీమ్ రన్నరప్ గా నిలిచారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post