శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి వేణుగోపాల్

పత్రికా ప్రకటన       తేది:17.11.2021, వనపర్తి.

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి వేణుగోపాల్ ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో మోడల్ కోడ్ కండక్ట్ (MCC) అమలు చేయాలని, FST, VST, SST, బృందాలు సమన్వయంతో పనిచేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని ఆయన సూచించారు. . డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతున్నదని, ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.సి.సి. నోడల్ అధికారి యుగంధర్ రెడ్డి, తహసిల్దార్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
………………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post