శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు – కలెక్టర్

 

డిచ్ పల్లి, నవంబర్ 25:– ఎస్బిఐ అందిస్తున్న శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

ఎస్ బి ఐ ఆధ్వర్యంలో
RSETI ద్వారా స్వయం ఉపాధికి శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు.

గురువారం డిచ్ పల్లీలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో, TTDC ని ఆయన సందర్శించారు. RSETI ఆధ్వర్యంలో CCTV శిక్షణ ముగించుకున్న ట్రైనీస్ కి ఈ సందర్భంగా సర్టిఫికెట్లు మరియు టూల్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈ శిక్షణ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ ద్వారా జీవితంలో స్వయం ఉపాధి పొంది తమ కుటుంబాలకు భరోసాగా నిలవాలని సూచించారు.

SBI RSETI ద్వారా చాలా చక్కని శిక్షణ అందిస్తున్నారని వీటి ద్వారా గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు మంచి పరిజ్ఞానాన్ని పొంది జీవితంలో స్థిరపడాలని కోరారు.

.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుధీంద్ర బాబు, ఆఫీస్ సిబ్బంది రామకృష్ణ, భాగ్యలక్మి, నవీన్, రంజిత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

Share This Post