శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, అక్టోబర్ -17:

శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో మంథని పరిథిలోని శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం పర్యావరణ సున్నితమైన జోన్ గా రీ నోటిఫై కొరకు ప్రతిపాదనలపై సంభందిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శివ్వారం మొసళ్ళ అభయారణ్యం గతంలో 10 కిలో మీటర్ ల పరిధితో సెన్సిటివ్ జోన్ గా ఉన్నదని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రీ నోటిఫై చేయాల్సి ఉన్నదని, శివ్వారం మొసళ్ళ అభయారణ్యం సరిహద్దు నుంచి అతి తక్కువ ఒక కిలో మీటర్ దూరంలో ఎకో సెన్సిటివ్ జోన్ గా పరిమితం చేయాలని ప్రతిపాదించినట్లైతే అట్టి పరిధిలో ఉన్న రెవెన్యూ భూమిలో ఎన్ని గ్రామాలు, పట్టా భూములు ఉన్నాయని, సర్వే నంబర్ ల వారీగా హద్దులను గుర్తించి వివరాలను ఇవ్వాలని, ఒక కిలోమీటర్ తర్వాత ఉన్న 7.5 కిలోమీటర్ ల వరకు అటవీ ప్రాంతం ఉన్నందున ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుగా ఏర్పాటు చేయుటకు రీ నోటిఫై చేయుటకు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు.

రీ నోటిఫై చేయు సందర్భంలో మంథని మండలంలోని ఖాన్ సాయిపెట్, ఖానాపూర్, భట్ పల్లి, అరెండ, చిన ఓదెల, గోపాల్ పూర్ (6) గ్రామాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ లో వచ్చి పరిమితులు ఏర్పడతాయని, కాబట్టి సర్వే చేసి వివరాలను సమర్పించాలని సూచించారు.

సెన్సిటివ్ జోన్ ఏర్పడిన తర్వాత ఆయా పరిధిలో చేయవలసిన, చేయకూడని పరిమితులను ఖరారు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

అంతకుముందు డి.ఎఫ్. ఓ. శివయ్య శివ్వారం మొసళ్ళ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమావేశంలో డి.ఎఫ్. ఓ. శివయ్య, మంథని
ఎఫ్.ఆర్.ఓ. వి.శ్రీనివాస రావు, డి.ఆర్.డి.ఓ. శ్రీధర్, సి.పి. ఓ. జి.రవీందర్, డి.పి. ఓ. చంద్రమౌళి, డి.టి. డబ్ల్యూ.ఓ. గంగారం, , జిల్లావ్యవసాయ శాఖ అధికారి, పరిశ్రమ శాఖ మేనేజర్, ఏ.డి.- మైన్స్, భూ గర్భ జల వనరుల శాఖ అధికారి ఆర్. సాయినాథ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, ఇరిగేషన్, విద్యుత్, మిషన్ భగీరథ, ఈ. ఈ. ఆర్ అండ్ బి., ఆర్. డబ్ల్యూ.ఎస్. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయము, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post