శిశు గృహలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దంపతులు*

నల్గొండ,జనవరి 3.నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జ్యోతి పాటిల్ తో కలిసి సోమవారం బాల సదన్,శిశు గృహ సందర్శించారు.శిశు గృహ లో కేక్ కట్ చేసి కలెక్టర్ దంపతులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. బాల సదన్,శిశు గృహ లోని శిశువులు,బాలికల కు పండ్లు, చాక్లెట్ లు పంపిణీ చేశారు.శిశు గృహ,బాల సదన్ లోని పిల్లల ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు.మౌలిక వసతుల అభివృద్ధి కి  నిధుల అవసరం ఉంటే ప్రతి పాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట మహిళా, శిశు సంక్షేమ,దివ్యాo గుల,వయో వృద్ధుల శాఖ సంక్షేమాధికారిణి  సుభద్ర, బాలల సంరక్షణ అధికారి గణేష్,బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ హరిత తదితరులు ఉన్నారు.

శిశు గృహలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దంపతులు*

Share This Post