శీథిలావస్థ ప్రభుత్వ భవనాల వివరాలు సమర్పించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం…..3 తేదిః 08-11-2021
శీథిలావస్థ ప్రభుత్వ భవనాల వివరాలు సమర్పించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అక్టోబర్ 08:
సోమవారం జిల్లా కలెక్టర్ శిభిర కార్యాలయం నుండి స్థానిక సంస్థల అధనపు కలెక్టర్, జిల్లాధికారులు, ఆర్డీఓ లతో జూమ్ దృశ్యశ్రవణ మాద్యమం ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వారంలోగా శీథిలావస్థ భవనాల వివరాల నివేధికను అందిచాలని, ప్రభుత్వ వసతి గృహలలో విద్యార్థులను వెంటనే సురక్షిత భవనాలలోకీ మార్చాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యక్షంగా పరీక్షించాలని ఆదేశించారు.
మంకీ ఫుడ్ కోర్టులను ప్రత్యేక అధికారులు పరీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఫ్రుట్ బెర్రి మొక్కలను నాటేలా చూడాలని పేర్కోన్నారు. TS b PASS పెండిగ్ లేకుండా చూడాలని, అనుమతులకు మీరి నిర్మాణాలు చేపట్టినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. భవన నిర్మాణాలు ఇచ్చిన అనుమతుల మేరకు జరుగుతున్నాయా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, అనుమతులు మీరి చేపట్టే నిర్మాణాలపై కోత్త మున్సిపల్ చట్టం ప్రకారం సకాలంలో చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. గ్రామపంచాయితి, అర్బన్ ప్రాంతాలలో సానిటేషన్ సక్రమంగా జరిగేలా చూడలాని, 2017-18 మంజూరైన ఋణాల యూనిట్లను స్థాపించేలా చర్యలు తీసుకోవాలని, ట్రైకార్ నుండి ఋణాల మంజూరుకు సంబంధించి యంపిడిఓల ద్వారా నివేధికలను స్వీకరించాలని ఆన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి డిడిఓ హజరు కాలేనట్లయితే విషయపరిజ్ఞానం ఉన్న అధికారులను మాత్రమే పంపించాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసేలా చూడాలని, మిగిలిన వ్యాక్సీన్ లను అందించడంలో అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. నిర్మాణాలకు సంబంధించి పనులు పూర్తిచేసి, యూసిలను సమర్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్థుల వివరాలను ధరణిలో నమోదు అయ్యేలా నివేధికను సిద్దం చేయాలని, ప్రభుత్వ స్థీర, చర ఆస్థుల వివరాల నివేధికను సిద్దం చేసి పంపించాలని, అన్ని కార్యాలయాలలో రోస్టర్ రీజీష్టర్లను నిర్వహించాలని ఆదేశించారు.
మల్టీలెవల్ ఎవెన్యూ ప్లానిటేషన్పై అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు. శాఖల పరంగా అభివృద్ది పనులపై అధికారులు దృష్టి సారించి ప్రగతిలో ముందంజలో ఉండాలని పేర్కోన్నారు. పోడు భూములపై ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభులను నిర్వహించి ప్రజల్లో పోడు పై అవగాహన కల్పించాలని, గ్రామ సభల నిర్వహణపై ముందుగానే గ్రామంలో సమాచారం అందించి, కమీటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోడు భూములకు సంబంధించి ఫామ్-ఏ లను అంధించి నివేధికను సిద్దం చేసి అందించాలని సూచించారు. పోడు వ్యవహరాలపై చట్టం ప్రకారమే అధికారులు వ్యవహరించాలని, అవగాహన లేకుండా అధికారులు ఎటువంటి హామీలను అందించరాదని పేర్కోన్నారు.
అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి వారి వివరాలను కామన్ సర్వీస్ సెంటర్ ల ద్వారా ఈ స్రామ్ ఫోర్టల్ రిజిస్ట్రేషన్ చేయించాలని పేర్కోన్నారు. అధికారుల ద్వారా ఈ శ్రాం పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, అర్హులైన వారందరికి గుర్తించి వారికి సంబంధించిన చేల్లింపులు సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కోన్నారు. చెల్లింపులు జరపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించినట్లయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post