శుక్రవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షాల దృష్ట్యా అధికారులు స్థానికంగా ఉండి అప్రమత్తంగా ఉండాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక

శుక్రవారం ఉదయం నుండి కురుస్తున్న  వర్షాల దృష్ట్యా అధికారులు స్థానికంగా ఉండి అప్రమత్తంగా ఉండాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, జూలై -22:

శుక్రవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షాల దృష్ట్యా అధికారులు స్థానికంగా ఉండి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ కె. శశాంక టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ఓవర్ ఫ్లో అయ్యే చోట ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఓవర్ ఫ్లో అయ్యే కాజ్ వే, లో లైన్ కాజ్ వే, బ్రిడ్జ్, కల్వర్టు ల దగ్గర ట్రాఫిక్ వెళ్లకుండా డైవర్ట్ చేయాలని, రెండు వైపులా రోడ్డును బ్లాక్ చేసి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తొర్రూరు డివిజన్ లో ఎక్కువ వర్షం పడుతున్నదని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇంతకు ముందు వర్షాల దృష్ట్యా ఏర్పాటు చేసుకున్న టీమ్ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, టామ్ టామ్ వేయించాలని కోరారు. అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

దంతాలపల్లి నుండి నర్సింహులపేట వెళ్ళే దారిలో కొమ్ములవంచ చెరువు దగ్గర రోడ్డు ఓవర్ ఫ్లో అవడం వలన బస్ మద్యలో ఆగి పిల్లలు ఇబ్బంది పడ్డారని, ఇటువంటి చర్యను సహించేది లేదని, ఓవర్ ఫ్లో అయ్యే రోడ్లపై నుండి వాహనాలు వెళ్లకుండా రోడ్డు మూసి వేసి ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని గతంలో చెప్పడం జరిగిందని, తెలిపిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంభందిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగు తుందని, ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వైద్య అధికారులు జాగ్రత్తగా ఉండి ఈ.డి.డి. కేసులను షిఫ్ట్ చేయాలని తెలిపారు.

ఏదైనా సమస్యలు ఉంటే అర్ధరాత్రి అయిన కూడా తనకు తెలపాలని సూచించారు.

పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో సమాచారం కలిగి ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట పోలీస్ లు ఓవర్ ఫ్లో వాటిపై వెళ్లకుండా పెట్రోలింగ్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో లు కొమురయ్య, ఎల్.రమేష్, ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post