శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రఘునాధపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో పర్యటించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 5:

శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రఘునాధపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డబుల్ బెడ్ రూం గృహ సముదాయంలో ఇంటింటికి వెళ్లి డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంట్లో, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని పాటించాలని ఆయన అన్నారు. దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వస్తాయని, దోమల నియంత్రణకై చేపట్టాల్సిన చర్యల గురించి చైతన్యం కల్గించారు. స్లాబ్ లపై వారానికొకసారి తనిఖీలు చేసుకోవాలని, నీటి నిల్వలు ఉంటే వెంటనే తొలగించాలని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే రెగ్యులర్ గా చేపట్టాలని, వారానికి ఒకరోజు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు స్లాబులు తదితర ప్రదేశాల్లో నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలు అప్రమత్తంగా వుంటూ, ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో కేటాయించిన వారు నివాసముంటున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల సముదాయంలో కాక గ్రామంలో జనాభా గురించి అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, డిఎంవో డా. సంధ్య, ఎంపిడిఓ రామకృష్ణ, తహసీల్దార్ నర్సింహారావు, వైద్యాధికారిని డా. శ్రవంతి, గ్రామ సర్పంచ్ కె. లలిత తదితరులు ఉన్నారు.

Share This Post