శుక్రవారం “ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం” సందర్భంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన
తేదీ 23.03.2023
శుక్రవారం “ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం” సందర్భంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

క్షయ వ్యాధిపై అపోహలు పెట్టుకోకుండా సరైన వైద్య సహాయం పొంది నివారించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. ఈనెల 24వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లు క్షయ వ్యాధి నివారణకు అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
టీబీ పేషంట్ లు ప్రతినెల పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
ఈ వ్యాధి పై అపోహలు పెట్టుకోవద్దని సరైన వైద్య సహాయం తీసుకుని నివారణ చేయించుకోవచ్చని తెలిపారు.
ప్రజలలో ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని అన్నారు రెండు వారాలు దగ్గు, జ్వరం, బరువు తగ్గడం లక్షణాలు ఉంటే టిబి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమాజంలో టీబి వ్యాధి విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, మోతిలాల్, డిఎంహెచ్వో సుధాకర్ లాల్, జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి రవి నాయక్, డిపిఓ కృష్ణ, టీబి ప్రత్యేక అధికారి డాక్టర్ రాజశేఖర్ డిపి ఓరేనయ్య, ఆర్డీవోలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

………… ……………. …. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం నాగర్ కర్నూల్ నుండి జారీ చేయడం అయినది.

Share This Post