శుభ్రపరిచిన ధాన్యం మిల్లులకు పంపి ధాన్యంలో కోత లేకుండా చెల్లింపులు జరిగెట్లు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ……. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

శుభ్రపరిచిన ధాన్యం మిల్లులకు పంపి ధాన్యంలో కోత లేకుండా చెల్లింపులు జరిగెట్లు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ……. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

శుభ్రపరిచిన ధాన్యం మిల్లులకు పంపి ధాన్యంలో కోత లేకుండా చెల్లింపులు జరిగెట్లు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ……. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

కురవి,
మహబూబాబాద్, మే -24:

శుభ్రపరిచిన ధాన్యాన్ని మిల్లులకు పంపి చెల్లింపుల సందర్భంలో ఎటువంటి కోతలు లేకుండా పూర్తి చెల్లింపులు జరిగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.

మంగళవారం కురవి మండల కేంద్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏ.బి. రైతు సేవా సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో శుభ్రపరిచి తేమ శాతం వచ్చిన ధాన్యం మిల్లుల్లో కటింగ్ కాకుండా, రైతులు నష్టపోకుండా చూడాలనీ, ట్రక్ షీట్ లో శుభ్రపరచిన ధాన్యం అని రాయాలని సూచించారు.

కొనుగోలు కేంద్రం కు వచ్చిన ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ యంత్రాల సహాయంతో శుభ్రపరుచుకొని, రోజు ఉదయం ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి, వెంటనే మిల్లులకు రవాణా చేయుటకు ఇన్చార్జిలు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్ లను, రసీదు లను పరిశీలించారు. ఎంత మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, గన్ని బ్యాగుల సరిపడా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ అడగగా, 126 మంది రైతులు ధాన్యం తీసుకొని రావడం జరిగిందని, 91 మంది నుండి కొనుగోలు చేసి రసీదులు ఇచ్చామని తెలిపారు.

అనంతరం కలెక్టర్ రైతులతో కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ధాన్యం శుభ్ర పరిచిన సందర్భంలో నష్టం ఉండదని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ఎటువంటి ఇబ్బందులూ లేవని రైతులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డి ఎం మహేందర్, తహసిల్డార్ ఇమాన్యూల్, ఎంపిడిఓ సరస్వతి, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారి మంజుర్ఖాన్, డిప్యూటీ తహశీల్దార్ నారాయణ రెడ్డి, ఏ పి. ఓ. ఏకాంబరం, ఏ.పి.ఎం. కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post