శ్రమదానంతో కార్యాలయ పరిశుభ్రత చేపట్టాలి…

ప్రచురణార్థం

శ్రమదానంతో కార్యాలయ పరిశుభ్రత చేపట్టాలి…

మహబూబాబాద్ జనవరి 3:

కార్యాలయాల పరిశుభ్రతకు ప్రతి నెల మూడవ శనివారం శ్రమదానం చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం కార్యాలయాల పరిశుభ్రతకు అధికారులు సిబ్బంది సంయుక్తంగా సమయం కేటాయించాలన్నారు.

కార్యాలయాల లోపల పరిశుభ్రతతో పాటు కార్యాలయ ఆవరణలో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటుకోవాలి అని తెలియజేశారు.

జిల్లా కార్యాలయాలకు వచ్చే లబ్ధిదారుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలన్నారు త్రాగునీరు సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులు ఇబ్బంది పడకుండా రెయిలింగ్ తో కూడిన ర్యాంపును నిర్మింప చేసుకొని ఫోటోలను అప్లోడ్ చేయాలన్నారు.

కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు ఇకపై ఈ – ఆఫీస్ ద్వారానే జరగాలన్నారు సమాధానాలు కూడా ఈ – ఆఫీస్ ద్వారానే పొందాలన్నారు.

అధికారులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లరాదన్నారు. ఇక పై అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను వెంటనే తెలియ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాషి అభినవ్, కొమురయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post