శ్రీనివాసపూర్ గ్రామ పంచాయతీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

పత్రికా ప్రకటన.   తేది:01.05.2022, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేందుకు, జిల్లాలోని యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి సూచించారు.
ఆదివారం శ్రీనివాసపూర్ గ్రామ పంచాయతీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో “వరి ధాన్యం కొనుగోలు కేంద్రం”ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వరి గ్రేడ్ మద్దతు ధరను రూ.1960/- గా, సాధారణ ధర రూ.1940/- గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగిందని, దీని ప్రకారం వరి ధాన్యం సేకరణ చేయడం జరుగుతుందని ఆయన సూచించారు. రైతులు సకాలంలో మార్కెట్ యార్డుకు ధాన్యం చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post