శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్

శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్

గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని తెల్లవారుజామున 5 గంటలకు ధనుర్మాసం ఉత్తరద్వార దర్శనం ద్వారా రంగనాయక స్వామిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ జిల్లా ఎస్పీ మనోహర్ దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ ఎస్పీలకు బాజా భజంత్రీల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తీర్థప్రసాదాలు పట్టు వస్త్రాలను వేదపండితులు అందజేశారు.

ఆలయ చరిత్రను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు రంగాచార్యులు, వినోద్, ఆర్డీవో నాగలక్ష్మి శ్రీపురం గ్రామ సర్పంచ్ మైన గాని నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జున్ నరసింహారెడ్డి గంధం ప్రసాద్ గోపీనాథ్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post