శ్రీరంగపురంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

పత్రిక ప్రకటన, తేది. 18.09.2021

గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై గ్రామ స్థాయిలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లల పెరుగుదలకు పోషక ఆహారాలను అందించాలని జిల్లా పరిషత్తు చైర్మన్ లోకనాథ్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
శనివారం శ్రీరంగపురం మండలంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో రక్తహీనత, పౌష్ఠిక ఆహారం లోపం , తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళలో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడం అన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్ఠిక ఆహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లు పునః ప్రారంభం అయినందున పరిశుభ్రత, పారిశుధ్యం పై ప్రత్యేక చోరువ తీసుకోవాలని సూచించారు. పిల్లలకు స్వచ్ఛమైన భోజనాలు, తాగు నీరు అందించాలని ఆయన సూచించారు. పోషక లోపం లేకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలని ఆయన సంబంధిత అధికారులకు తెలిపారు.
పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, 0-6 చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ పుష్పలత, హలో జెడ్ పి టి సి వెంకట్రావమ్మ, శ్రీరంగాపురం జెడ్ పి టి సి రాజేంద్ర ప్రసాద్, ఎంపీటీసీ, సర్పంచ్, కో ఆప్షన్ సభ్యులు, సూపర్వైజర్ కృష్ణ చైతన్య, పెబ్బేరు ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారి, శ్రీరంగాపూర్ అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post