శ్రీరంగపూర్ మండలంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్నిసందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్వాన్

పత్రిక ప్రకటన    తేది:21.01.2022, వనపర్తి.

హరిత హారంలో భాగంగా పర్యావరణాన్ని పరి రక్షించుటకు ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం శ్రీరంగపూర్ మండలంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయగా, 13 మండలాల్లో  బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని, కేవలం శ్రీరంగపూర్ మండలంలోని 10 ఎకరాల బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు పెండింగ్ లో ఉన్నాయని, అధికారులపై ఆయన ఆగ్రహం వక్త్యం చేసారు. వారంలోగ పనులు పూర్తి చేయాలని ఎంపీడీఓ ను ఆయన ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుటకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పత్ర్యేక అధికారి కేశవులు, ఏపీడీ సుల్తాన్, ఎంపీడీఓ, ఏపీఓ, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post