శ్రీ మహర్షి భగీరథ జయంతి…..

శ్రీ మహర్షి భగీరథ జయంతి…..

ప్రచురణార్థం

శ్రీ మహర్షి భగీరథ జయంతి…..

మహబూబాబాద్, మే -08:

శ్రీ మహర్షి భగీరథ జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక శ్రీ మహర్షి
భగీరథ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, నేడు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జయంతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, యువకులు భగీరధ మహర్శీని ఆదర్శంగా తీసుకొని జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం. నరసింహా స్వామీ, సగర, ఉప్పర ప్రతినిధులు సమ్మయ్య, ఉప్పలయ్య, యాదగిరి, మురఌ, శ్రీనివాస్, భిక్షపతి, రఘు, బి.సి. కార్యాలయ సిబ్బంది జి. అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post