ప్రచురణార్థం
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు …..
మహబూబాబాద్, మే -03:
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను మంగళవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ, శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, నేడు కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జయంతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.సి. వెల్ఫేర్ అధికారి ఎం. నర్సింహా స్వామీ, లింగాయత్ కుల ప్రతినిధులు నాగరాజు, నాగయ్య, జిల్లా బి.సి., రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.