శ్రీ లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో లక్కీ డిప్ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:20.11.2021, వనపర్తి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డిప్ ద్వారా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
శనివారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన లక్కీ డిప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలోని 37 మద్యం దుకాణాలకు సంబంధించి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో (37) రిటైల్ మద్యం దుకాణాలకు గాను (694) దరఖాస్తులు అందాయని, ఎస్.టి.లకు (1), ఎస్.సి.లకు (5), గౌడ సామాజిక వర్గాలకు (4), రిటైల్ మద్యం షాపులను జిల్లా కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా కేటాయించినట్లు ఆమె వివరించారు. మద్యం దుకాణాలలో 15% గౌడలకు, 10% ఎస్.సి.లకు, 5% ఎస్.టి.లకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎస్.సి, ఎస్.టి, గౌడ వర్గాలకు ప్రభుత్వ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కేటాయించగా (27) మద్యం షాపులు జనరల్ కేటగిరి కింద కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఇందులో (27) దుకాణాలు ఓపెన్ కేటగిరి కింద రిజర్వు చేయబడినట్లు ఆమె తెలిపారు. 1.12.2021నుండి 2023 వరకు కేటాయించబడిన దుకాణాలు నడుపుకోవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపులు నిర్వహించినట్లు ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ  అసిస్టెంట్ కమషనర్ జనార్ధన్ రెడ్డి, సి. ఐ. సుభాష్  చందర్ రావు,ఓంకార్, మల్లికార్జున్ అధికారులు, ఏ.ఎస్.పి.శకైర్ హుస్సేన్ ,సి. ఐ. ఏస్. ఐ. లు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post