షాదుఖానాను ప్రారంభించి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

షాదుఖానాను ప్రారంభించి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన షాదీఖానా ను ప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని ఈ ఫలితాలు రాబోయే నాలుగు, ఐదు సంవత్సరాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని అన్నారు.రాబోయే కాలంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత స్థాయి అధికారులను చూస్తామని అన్నారు. దేశంలో 80 శాతం పైగా బీద వర్గాలను ఉన్నారని వారి అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రంజాన్ మాసంలో ఉదయం వేళ, సాయంకాలం వేళ విద్యుత్ ఉండేలా చూడాలని కోరేవారని కానీ నేడు 24 గంటలు విద్యుత్తు అందిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వంత జాగా కలిగినవారికి ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మంది చొప్పున న ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనుందని అన్నారు. పేద ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ అందిస్తున్నామని మంత్రి వివరించారు.7 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించామని హైదరాబాదులో ఎటువంటి అల్లర్లు జరగలేదని అన్నారు. షాదీఖానా పై మరో అంతస్తు నిర్మించుటకు, అంతర్గత రహదారి నిర్మాణానికి అంచనాలు రూపొందించి త్వరలో నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు .షాదీఖానా నిర్వహణ బాధ్యత మీదేనని కమిటీ వేసుకొని మంచిగా నిర్వహించుకోవాలని వివాహాది శుభకార్యాలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నూతనంగా మెదక్ జిల్లా ఏర్పడి అన్ని రంగాలలో ముందుకు వెళుతుందని, చక్కటి రహదారులు, సిగ్నల్ ఏర్పాటుతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల మంజూరైందని మంత్రి వివరించారు.ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ టాయిలెట్స్, కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి 35 లక్షలు అందజేస్తామని అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ షాదీఖానా ప్రహరీ గోడకు ఎమ్మెల్యే నిఫుల నుండి 15 లక్షలు మంజూరు చేస్తున్నానని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు
అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, దేవేందర్ రెడ్డి ,బట్టి జగపతి, ఆర్ డి ఓ సాయిరాం ఇమాములు తదితరులు పాల్గొన్నారు

Share This Post