షాద్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

షాద్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
బుధవారం కొత్తూరు మండలంలోని రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్యెల్యే అంజయ్య యాదవ్ లతో కలిసి జహంగీర్ పీర్ దర్గాను సందర్శించి బాబా దర్శనం చేసుకున్నారు. అనంతరం షాద్ నగర్ నియోజకవర్గం, కేశంపేట మండలం, ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. అల్వాల కొత్తపేట, షాద్ నగర్ గ్రామాలలో రైతు వేదిక లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు . కేశంపేటలో 30 పడకల ఆసుపత్రి భవనమునకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు
షాద్ నగర్ లో వంద పడకల ఆసుపత్రి భవనమునకు రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ లతో కలిసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటు ముందుకు వెళ్లడం జరుగుతున్నదని తెలిపారు, దేశంలోనే రాష్ట్రాన్నితలసరి ఆదాయంలో అగ్రగామిగా నిలబెట్టడం జరిగినదని అన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రవేశపెట్టి, 24 గంటల కరెంటు, సాగునీరు అందించడం వలన రైతులు ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవడం జరుగుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పేదింటి ఆడపిల్లల పెండ్లికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతున్నదని అన్నారు ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రన్ని సస్యశామలంగా విలసిలుతున్నది , షాద్ నగర్ లో ఇప్పటీకే ఉన్న 50 పడకల ఆసుపత్రిని మాత శిశు ఆసుపత్రిగా మారుస్తాం . ట్రామా కేర్ సెంటర్, 20 ANM సెంటర్లకు త్వరలోనే మంజూరి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వంద పడకల ఆసుపత్రిని 21 కోట్ల రూపాయలతో అన్ని సదుపాయాలతో ఏడాదిలోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు.
షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత మార్పును మనమందరం గమనించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, పేదింటి ఆడపిల్లల పెళ్ళికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా 24 గంటలు కరెంటు, సాగునీరు, రైతు బంధు ప్రవేశపెట్టి పెట్టుబడులు సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. పేద పిల్లల చదువు కోసం గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు మాజీ మంత్రి, జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post