షాపు నంబర్ 46 కు సంబంధించిన మద్యం దుకాణంను లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తున్నజిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. ( కరీంనగర్ జిల్లా )

లాటరీ ద్వారా మోగ్దుంపూర్ మద్యం దుకానం కేటాయింపు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000

కరీంనగర్ రూరల్ మండలం మోగ్దుంపూర్ గ్రామంలోని మద్యం వైన్ షాపును లక్కీడ్రా ద్వారా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ తెలిపారు.

మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన లిక్కర్ రిటైల్ షాపునకు సంబంధించి 31 మంది దరఖాస్తు చేసుకోగా, అందరికీ టోకెన్లు జారీ చేశారు. మంగళవారం 31 టోకెన్లను లక్కీ లాటరీ ద్వారా కలెక్టర్ డ్రా తీయగా 16 వ నెంబర్ దరఖాస్తుదారుడు మూల వెంకటేశం వైన్ షాప్ ను దక్కించుకున్నారు.

క్రితం జరిగిన మద్యం దుకాణాల కేటాయింపుల్లో వైన్ షాప్న కు కేవలం ఐదు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ఉన్నతాధికారుల సూచనల మేరకు డ్రా ప్రక్రియను నిలిపి వేసి, రీ నోటిఫికేషన్ ఇచ్చామని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. దీంతో అదనంగా 26 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. మొత్తం 31 మంది దరఖాస్తుదారుల నుంచి లాటరీ ద్వారా వైన్ షాప్ కేటాయించామని ఆయన తెలిపారు.

Share This Post