షార్ట్ ఫిల్మ్ లో
జాతీయ స్థాయిలో జిల్లా 2 వ బహుమతి కి ఎంపిక …..జిల్లా కలెక్టర్ హనుమంతరావు
స్వచ్ఛత ఫిల్మొంకా
(Swachtha filimonka )అమృత్ మహోత్సవ్ లో బాగంగా
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ODF ప్లస్ లో బాగంగా జాతీయ స్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించడం జరిగిందని,
అందులో బాగంగా రాష్ట్రంనుండి 1394 లఘు చిత్రాలు తీసి పంపారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా నుండి 72 షార్ట్ ఫిలిం లను అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. అందులో తడి , పొడి చెత్త నిర్వహణ లో సంగారెడ్డి జిల్లా ,కంగ్టి మండలం ఎంకేమూరి గ్రామ పంచాయతీ సెక్రటరీ అభిలాష్ తీసిన షార్ట్ ఫిల్మ్ జాతీయ స్థాయిలో 2 వ బహుమతి కి ఎంపికైందని కలెక్టర్ తెలిపారు.
నవంబర్,19 న ( world toilet day) ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీ లో అవార్డ్ అందుకుంటార ని తెలిపారు..
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ , DPO,DRDO లు అభిలాష్ కు అభినందనలు తెలిపారు.