షెడ్యూల్డ్ కులాల కుటుంబాల ఆర్థిక అభివృదే లక్ష్యం – రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లాలో విద్యావంతులైన నిరుద్యోగ ఎస్సీ యువతకు వివిధ సంస్థల ద్వారా ఉచితంగా నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలు అందించి ఆయా సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్ మేనేజర్ బి. ఆనంద్ కుమార్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈడీ రామ్ లాల్ తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ…..
జిల్లాలో 2020-21కిగాను శిక్షణ ఆధారంగా యూనిట్లను కేటాయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగానే 80మందికి స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వం రూ.40కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా వివిధ రకాల యూనిట్లు దళిత కుటుంబాల స్వయం ఉపాధి కేటాయిస్తున్నట్లు చెప్పారు
యూనిట్లకు కార్పొరేషన్‌ రాయితీ, బ్యాంకు ద్వారా రుణాలు మంజూరవుతాయన్నారు.
నైపుణ్య శిక్షణ పొందిన వారికి యూనిట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
దీనికి సంబంధించిన విధివిధానాలపై ఆయన అవగాహన కల్పించారు.
జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం నాగర్ కర్నూలు ద్వారా యస్.సి. నిరుపేద కుటుంబాల ప్రయోజనం కోసం భూమి కొనుగోలు పథకం కింద నుండి ఇప్పటి వరకూ వరకు 201 లబ్దిదారులకు 374 మూడెకరాల ఎకరాల భూమికి 16 కోట్లు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో స్వయం ఉపాధి కింద ఇప్పటివరకు3239 మందికి 52 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి కల్పించినట్లు చెప్పారు.
ఎస్సీ కార్పొరేషన్ అందించే రుణాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, సామాజిక మరియు ఆర్ధిక అభివృద్ధి కోసం పేద షెడ్యూల్డ్ కులాలు కుటుంబాలకు ఆదాయ ఉత్పత్తి ఆస్తులను సృష్టించేందుకు ఆర్థిక సహాయం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యం అన్నారు.
ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆదాయ ఉత్పాదక ఆస్తులను సృష్టించటానికి మరియు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
స్వయం ఉపాధికి దారితీసే నైపుణ్యం పెంపొందించుట కొరకు శిక్షణా కార్యక్రమాలను అందిస్తుందని,మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్ధిక సహాయక కార్యకలాపాలను చేపట్టడానికి తోడ్పడుతుందన్నారు.
ఆర్థిక అసమానతలను తొలగించుట కొరకు వివిధ పథకాలకు మద్దతునిస్తుందని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనన్నారు.
80% (యూనిట్ ధర రూ .1.00 లక్షల వరకు)
70% (యూనిట్ వ్యయం Rs.2.00 లక్షల వరకు)
60% (రూ .2.00 లక్షల నుంచి రూ .7 లక్షల వరకు యూనిట్ వ్యయం కోసం 5 లక్షల రూపాయల వరకు పరిమితం) రుణ సదుపాయాలు పొందేందుకు వీలుందన్నారు.
పదవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించి ప్రైవేట్ రంగ వైద్య ఆరోగ్య, విమాన రంగం సంస్థల్లో సంవత్సరానికి 6 లక్షల రూపాయల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్ మాట్లాడుతూ కొత్తగా మంజూరైన రుణాల 80 మంది యూనిట్లకు దారులకు అవగాహన తో పాటు 54 మంది యువకులకు పూర్తిగా రాష్ట్రం ప్రభుత్వ ఖర్చుతో ఒక్కొక్కరికి 25 వేల రూపాయలతో ఆర్టీసీ ద్వారా డ్రైవింగ్ శిక్షణ అందించడం జరుగుతుందని శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారికి లైసెన్స్ తో పాటు ఆర్టీసీ ఉద్యోగాల నియామక సందర్భాల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు.
లబ్ధిదారులకు రెండు రోజుల్లో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల శాసన సభ్యుల ద్వారా యూనిట్లను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
లబ్దిదారులు ప్రభుత్వం అందించే రుణాలతో ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్టీసీ డిఎం శ్రీనివాస్ నాయక్, అశోక్ ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post