షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల నిర్వహణ, ఉపకార వేతనాలపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన.   తేది:8.12.2021, వనపర్తి

వారం రోజులలోపు వసతి గృహ విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లను తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని నుశితను, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్  కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాల నిర్వహణ, ఉపకార వేతనాలపై జిల్లా కలెక్టర్  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 నుండి 8 వ తరగతి వరకు విద్యనభ్యసించే ఎస్సి విద్యార్థుల ప్రి/పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ల కొరకు బ్యాంకు అకౌంట్లను వారం రోజుల లోపు తెరిచే విధంగా, బ్యాంకు వారితో మాట్లాడి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, అధికారులకు ఆమె సూచించారు. జిల్లాలో 3651 మంది ఎస్సీ విద్యార్థులు ఉండగా, 104 మంది ఎన్రోల్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు కులం, ఆదాయం సర్టిఫికెట్ ల జారీకి తాసిల్దారు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి నుషిత, యం. ఈ. వో. లు, హాస్టల్ వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయనైనది.

Share This Post