సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. కలలు సాకారమవుతాయని, విజయాలు వెతుక్కుంటూ వరిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోది యువతకు పిలుపునిచ్చారు.

ప్రచురణార్థం

మే. 30 ఖమ్మం:–

సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. కలలు సాకారమవుతాయని, విజయాలు వెతుక్కుంటూ వరిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోది యువతకు పిలుపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమగ్ర సంరక్షణకై ఏర్పాటు చేసిన పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం నుద్దేశించి. సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతకు దిశా నిర్దేశం చేసారు.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక రాష్ట్ర మంత్రివర్యులు కుమారి ప్రతిమా భౌమిక్, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్తో కలిసి కలెక్టరేట్ నుండి ఇట్టి వీడియో కాన్ఫరెన్క హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోది మాట్లాడుతూ కరోనా మహమ్మారీ వల్ల దేశవ్యాప్తంగా 4,345 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి. అనాధలయ్యారని, వీరందరికి సంరక్షణ, విద్యా, ఆరోగ్య సేవల ద్వారా శక్తివంతం చేసి వారి స్వయం సమృద్ధికై సన్నద్ధం చేసేందుకు పి.ఎం. కేరఫర్ చిల్డ్రన్ స్కీంను అమలు చేస్తున్నామన్నారు. ఇ ట్టి చిన్నారులకు ప్రభుత్వం, ప్రయివేటు పాఠశాలలో ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫాన్స్ అందిస్తున్నామని, భవిష్యత్తులో ఉన్నత, వృత్తిపరమైన విద్యకోసం విద్యాఋణాలను కూడా అందిస్తామని పాఠశాల విద్యానంతరం 18 నుండి 23 సంవత్సరాల వయస్సులోపు ప్రతినెలా నాలుగువేల రూపాయల స్టెఫండ్ అందించడంతో పాటు 23 సంవత్సరాల వయస్సు అనంతరం ఒకేసారి10 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. దీనితోపాటు ఆరోగ్యపరమైన సేవలకు గాను ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య సేవలు, ఫిట్ ఇండియా ద్వారా శారీరక వ్యాయామ యోగా వసతులు అందిస్తున్నామని, చిన్నారులు, యువత, నిరాశ నిసృహకు అవకాశం ఇవ్వకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయని ఆయన అన్నారు. నేటి యువత జీవితంలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని జీవితంలో ఎదురయ్యే అనేక ఒడిదొడుకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని, ఓటమిని దరిచేరనీయరాదని అదే జీవితంలో గొప్ప విజయమని ప్రధానమంత్రి అన్నారు. కరోనా కష్టకాలంలో పి.ఎం. కేర్ నిధిలో అనేక మంది ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఎందరో జీవితాలను కాపాడటంలో భాగస్వాములైనారని ఆయన తెలిపారు. ముఖ్యంగా నేటి చిన్నారులు, రేపటి యువత విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలని, ఉపాధ్యాయులు, అధ్యాపక భోధనలతో పాటు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని దీనితోపాటు ఫిట్ ఇండియా, ఖేల్ ఇండియాలో తప్పనిసరిగా పాలుపంచుకోవాలని, యోగా శారీరక వ్యాయామం నిత్యజీవితంలో ఒక భాగం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతదేశం తన సామర్ధ్యంపై నమ్మకం ఉంచి రెండున్నర సంవత్సరాల కాలం కరోనా క్లిష్టపరిస్థితులలోను సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని, దేశ అవసరాలతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాక్సిన్ అవసరాలను తీర్చామని ఆయన అన్నారు. గత 8 ఏండ్లుగా పేదప్రజల సంక్షేమం కోసం, పేదవారి అధికారాలను, హక్కులను ప్రతి పేదవానికి అందించాలనే లక్ష్యంతో ముందు కెళ్తున్నామని భారతదేశం అన్ని రంగాలలో సాధించిన ప్రగతి ద్వారా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఇది యువశక్తి వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి పి.ఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీముక్కు సంబంధించిన ఆరోగ్యభీమా, పి.ఎం.జే.ఏ. వై ధృవీకరణ పత్రాలను సంబంధిత విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత రాష్ట్ర మంత్రి కుమారి ప్రతిమా భౌమిక్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను పి.ఎం.కేర్స్ నిధుల నుండి కేంద్రప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నట్లు తెలిపారు ఖమ్మం జిల్లాలో 14 మంది పిల్లలు కోవిడ్ కరోణా వల్ల తల్లిదండ్రులను కోల్పోయారని అందులో ముగ్గురు 18 ఏండ్లకు పైబడ్డవారు ఉండగా 11 మంది 18. ఏండ్లలోపు వారు వారు ఉన్నారన్నారు. పి.ఎం. కేన్స్ ఫర్ చిల్డ్రన్ పథకం క్రింద 10 లక్షల మొత్తాన్ని పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తారని, పిల్ల వానికి చదువు కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేల స్కాలర్షిప్ అందిస్తామని అన్నారు. ప్రతి నెల 4 వేలు ప్రోత్సహాకంతో పాటు ఉన్నత చదువులకోసం ప్రతి సంవత్సరం 50 వేలు అందిస్తామన్నారు. 5 లక్షల ఆయూష్మన్ ఆరోగ్య భీమా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రప్రభుత్వానికి చెందిన విద్యా సంస్థల్లో ఎలాంటి షరతులు లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆమె అన్నారు. ఏ పిల్లవానికి ఏ సమస్య ఎదురైనా శాఖ వెబ్సైట్ చైల్డ్ కేర్ డాష్ బోర్డ్ లో తెలపాలని వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. చదువుకోలేని వారికి వృత్తినైపుణ్యం శిక్షణ ఇచ్చి ఉపాధికి చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన లోటు తీర్చలేనిదని తెలుపుతూ, వారిని అనాథలని అ నొ ద్దని భారత్ అంతా వారి వెంట వుందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి డా॥విలింద్ రాస్టిక్, అదనపు కలెక్టర్లు స్నేహలత. మొగిలి, ఎన్.మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారిని విష్ణునందన, తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post