*సంకల్పం ఉంటే జ్ఞానంతో, బుద్ధిబలంతో ఎంతటి లక్ష్యాయాలనైనా ఛేదించవచ్చు …..మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక

*సంకల్పం ఉంటే జ్ఞానంతో, బుద్ధిబలంతో ఎంతటి లక్ష్యాయాలనైనా ఛేదించవచ్చు …..మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం

*సంకల్పం ఉంటే జ్ఞానంతో, బుద్ధిబలంతో ఎంతటి లక్ష్యాయాలనైనా ఛేదించవచ్చు …..మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక.*

తొర్రూర్,
మహబూబాబాద్ జూలై -20:

సంకల్పం ఉంటే కలలు నిద్ర పోనివ్వకుండా చేస్తాయని, కృషి పట్టుదలతో ఎంతటి గమ్యానైనా చేదించవచ్చునని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

బుధవారం మధ్యాహ్నం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డులో సమీకృత సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని వంద మంది పేద విద్యార్థులకు పాఠశాలకు వెళ్ళుటకు సౌకర్యార్ధంగా దాతల సహకారంతో ఉచిత నూతన సైకిల్ లను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి హాస్టల్ విద్యార్థులకు , శ్రీనివాస గార్డెన్లో ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో కొనసాగుతున్న పోటీ పరీక్షలకై ఉచిత శిక్షణ శిభిరంలో 800మంది యువతి, యువకులకు జిల్లా కలెక్టర్ కె శశాంకతో కలసి మంత్రి స్టడీ మెటీరియల్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, హాస్టల్లో స్టూడెంట్ 200 వందలకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, 7వేల కోట్లతో పాఠశాల అభివృద్ధి కేటాయించడం జరిగిందని, కార్పొరేట్ స్థాయిలో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఎస్సీ డి డి సమీకృత సాంఘిక సంక్షేమ వసతి గృహం ఉమ్మడి జిల్లాలొనే నెంబర్ వన్ గా ఉందని, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, విద్య కన్నా వినయం ప్రధానమని మంత్రి తెలిపారు.

ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 73 రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా కానిస్టేబుల్ ఎస్ఐ ,గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న నియోజకవర్గంలోని ఎనిమిది వందల మంది యువతీ, యువకులకు మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిస్తూ ఉత్తమమైన ఫ్యాకల్టీ ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుందని, మీ భవిష్యత్తు మా జీవిత లక్ష్యమని, ట్రస్టు ద్వారా అనేక రకాలుగా మా సేవలు మీకు ఎప్పుడు అందిస్తామని, ప్రతి ఒక్కరిలో అడ్వాన్స్ ప్రిపరేషన్ భావన ఉండాలని, మీకోసం మేము ఆలోచిస్తున్నా, మీకోసం, భవిష్యత్తు కోసం కుటుంబం కోసం ఎంతవరకు ఆలోచిస్తున్నారని, భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో నియోజకవర్గం నుండి 80% ఉద్యోగాలు సంపాదించాలని, తల్లిదండ్రుల స్ఫూర్తి అవసరమని, గతంలో 354 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించారని, 81 వేల ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం 60 లక్షల ఉద్యోగాలను పెండింగ్ లో పెడుతూ కాలయాపన చేస్తోందని మంత్రి తెలిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ శిక్షణ సద్వినియోగం చేసుకొని టెట్ క్వాలిఫై న విద్యార్థులు మంత్రిని గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, జిల్లాలోని 110 వసతి గృహాల్లో ఎస్సీ డెవలప్మెంట్ ప్రీ మెట్రిక్ 20, పోస్ట్ మెట్రిక్ 4, ఉన్నాయని, తొర్రూరు ప్రాంతంలో విద్యాసంస్థలు అనేకంగా ఉన్నప్పటికీ గతంలో ఉన్న హాస్టల్ లో అరకొర వసతులు ఉండేవని,18 లక్షల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గా అప్గ్రేడ్ చేసి, హంగులను వసతులను కల్పించడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా మెయిన్ డోర్ లకు, కిటికీలకు, వెంటిలేటర్ లకు మెస్ డోర్ లు అమర్చడం జరిగిందని, ప్రథమంగా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోనే డీ ఫ్రిడ్జ్ సౌకర్యం ఉన్న హాస్టల్ ఇదని, లైబ్రరీ కిచెన్, కిచెన్ గార్డెన్, 2 జతల షూ,4 జతల బట్టలు, ట్రన్క్ బాక్స్, నోట్ బుక్స్ హాస్టల్ గోడలపై మోటివేషనల్ పిక్చర్లు, ప్యూరిఫైడ్ కు తగ్గకుండా స్వచ్ఛమైన నీరు, టాయిలెట్ లకు రన్నింగ్ డైనింగ్ హాల్, టీవీ, 3 కంప్యూటర్లు వాల్ మెయింటెన్ ఫ్యాన్స్ స్టీల్ బెంచీలు మొదలైన సకల సౌకర్యాలతో జిల్లాలోనే పైలెట్ హాస్టల్ గా ప్రారంభించనైనదని,100 మందికి పైగా విద్యార్థుల సంఖ్య ను పెంచడం జరిగిందని ఇంకొంత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని, ప్రభుత్వం వైపునుండి సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇతర హాస్టళ్లకు ఆదర్శంగా ఉండాలని, ప్రతి నెల విధిగా ఆకస్మిక తనిఖీలు చేయాలని, ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు, ఇంటిగ్రేటెడ్, ఎస్పీ నిధుల నుండి హాస్టల్ అభివృద్ధి పనులకు కేటాయించి నట్లు, మున్సిపల్ శాఖ నుండి 5 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ నుండి హాస్టల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయనైనదని, ఉన్నత స్థాయిలో విజయాలు సాధించడమే మీ నుండి కోరుతున్నామని, విద్యతో పాటు క్రమశిక్షణ, వ్యాయామం, సమయపాలన పాటించాలని అన్నారు. సైకిళ్ల కొనుగోలుకు దాతలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కలెక్టర్ తెలిపారు.

అనంతరం హాస్టల్ విద్యార్థులకు సైకిళ్లను, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరంలో యువతీ యువకులకు పరీక్షలకు స్టడీ మెటీరియల్ లను మంత్రి, కలెక్టర్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు దాతలకు పేరు పేరునా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ రామ చంద్రయ్య, ప్యాక్స్ చైర్మన్ హరిప్రసాద్ ,ఆర్డీవో ఎల్ రమేష్, ఇన్చార్జి ఎస్సి డెవలప్మెంట్ అధికారి సన్యాసయ్య, తహసిల్దార్ రాఘవ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ఎంపీడీవో కుమార్, ఈ డబ్ల్యు ఐ డి సి ఈఈ నరేందర్ రెడ్డి, డి ఈ రవీందర్ ఎస్సి వెల్ఫేర్ సూపర్డెంట్ పూర్ణ, విద్యార్థులు, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్,చారి పాల్గొన్న పార్టీ శ్రేణులు,విద్యార్థి, విద్యార్థినీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

<

Share This Post