సంకీరెడ్డిపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్నితనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
7 9 2021
వనపర్తి

బృహత్ ప్రకృతి వరాలు ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిధిలో సంకీ రెడ్డిపల్లి లో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటి 100% హరితహారం కార్యక్రమం పూర్తిచేశామని తెలిపారు. జిల్లాలోని 14 మండలాల్లో మండల కేంద్రంలో ఒక బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందమైన అన్ని రకాల మొక్కలు పెంచి వాటికి నీరు పట్టాలని ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ,అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

…. జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి జారీ చేయడమైనది.

 

Share This Post