సంక్షేమ పథకాలు అమలు పరచడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సంక్షేమ పథకాలు అమలు పరచడంలో రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

మంగళవారం ఉదయం రాయపర్తి మండలంలోని మంచినీళ్ళ చెరువు లో మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ గోపి చేతుల మీదుగా చేప పిల్లలను విడుదల చేశారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని కులాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని అన్నారు రాష్ట్రంలో కుల వృత్తుల ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు అన్నివర్గాలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలు పడుతుందని మంత్రి తెలిపారు

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ముందుచూపుతో చెరువులకు జలకళ సంతరించుకుంది అని మంత్రి పేర్కొన్నారు.

రాయపర్తి మంచినీళ్ళ చెరువు లో ఇరవై ఎనిమిది వేల ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.బి హరిసింగ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
——————————————-
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారిచే జారీ చేయడమైనది.

Share This Post