సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మంగళవారం ఇంటింటికి వెళ్ళి కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి స్వయంగా 32 మంది లబ్ధిదారులకు అందజేశారు

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 07 ఖమ్మం:

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మంగళవారం ఇంటింటికి వెళ్ళి కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి స్వయంగా 32 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా ఆడపిల్లల వివాహాల ఆర్ధిక సహాయం కింద కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా సుమారు యాభైకోట్ల రూపాయలను అందించినట్లు మంత్రి తెలిపారు. మొదటిలో 50 వేల రూపాయలతో మొదలైన కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పధకం ఆర్ధిక సహాయాన్ని 75 వేల రూపాయలుగా అనంతరం 1 లక్షా నూట పదహారు రూపాయలకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు పెంచారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పేద ప్రజల ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక బరోసా కల్పిస్తున్న ఇట్టి పథకం తనకు ఎంతో ఇష్టమైనదని, మొదటి నుండే ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారునికి చెక్కులను అందించడం సంతృప్తినిస్తుందని మంత్రి అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందని తద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని రేగుల చెలకలో ముగ్గురికి, కోయచెలకలో ఒక్కరికి, కోటపాడులో నలుగురికి, చిమ్మపూడిలో ఇద్దరికి, పాపటపల్లిలో ఒక్కరికి, బూడిదెంపాడులో ఒక్కరికి, మంచుకొండలో ఇద్దరికి, పువ్వాడనగర్లో ఒక్కరికి, రఘునాథపాలెంలో నలుగురికి, చింతగుర్తిలో, గణేశ్వరంలో ఒక్కోక్కరికి, వేపకుంట్లలో ఐదుగురికి, వి.వెంకటాయపాలెంలో 4 గురికి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం మంత్రి లబ్దిదారులకు అందజేశారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రఘునాథపాలెం జడ్పీ టి.సి మాళోతు ప్రియాంక, ఎం.పి.పి. భూక్యాగౌర్, సుడా చైర్మన్ డైరెక్టర్ వీరునాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి ఎ.విజయకుమారి, తహశీల్దారు. నర్సింహారావు, ఎం.పి.డి.ఓ రామకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎం.పి.టి.సిలు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post