సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు  ఇంటి వాతావరణాన్ని  తలపించే విదంగా ఉండాలని ఎస్సి సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా తెలిపారు

. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, నిర్వహణ తీరు తెన్నుల పరిశీలనకు జిల్లాకు వచ్చిన కమిషనర్ భద్రాచలం పట్టంలోని బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని తనిఖీ చేసారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ద్యేయంతో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  విద్యార్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి సంక్షేమ గృహాలలో విద్యార్థులకు ఇంటి వాతావరణం తలపించేలా ఉండాలని, కోవిడ్ నియంత్రణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు.  విడిరాదులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వసతి గృహంలోని అన్ని  గదులను, మరుగుదొడ్లను పరిశీలించారు. నేల మీదనే కూర్చుని  విద్యార్థులతో వసతి గృహాల్లో  అందుతున్న వసతులు, సౌకర్యాలు గురించి  అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, మంచి ఉన్నత విద్యను అభ్యసించి తల్లి దండ్రులకు సమాజానికి మంచి పేరు తెచ్చే విదంగా ప్రయోజకులు కావాలని చెప్పారు.. హాస్టల్స్ లోని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు అందచేయాలని చెప్పారు.  హాస్టల్స్ లోని మరుగుదొడ్లు, భవనాల మరమ్మత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని, నిధుల వినియోగంలో భద్రాద్రి జిల్లా ముందంజలో ఉందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఆర్జేడీ హనుమంత రెడ్డి, జిల్లా ఎస్సి అభివృద్ధి   అధికారిణి అనసూర్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post