సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-2
జనగామ, డిసెంబరు 8:
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సాంఘీక సంక్షేమ శాఖ, వెనక బడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న వసతి గృహాలలో చువుతున్న విద్యార్దులకు త్రాగునీరు, విద్యుత్, విద్యార్దులు పడుకునే గదులల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసి కిటీకీలకు, డోర్లకు మెష్ లు చేపించాలన్నారు. టాయిలెట్స్, డిజిటల్ లైబ్రరీ, జిమ్, స్టడీ హాల్ సౌకర్యాలు కల్పించాలని, విద్యార్దులందరికి రుచి కరమైన వంటలు చేయాలన్నారు. వసతి గృహాలలో చిన్న చిన్న పనులు, మరమ్మత్తులు, గోడలకు రంగులు, బోర్డ్స్, ప్రహారీ గోడ, దుస్తులు ఆర వేసుకునేందుకు స్టీల్ రాడ్ లను ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్ధులకు మంచి ఆహ్లాద కరమైన వాతావరణంలో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలి ఉన్న పెండింగ్ పనుల కోసం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు వసతి గృహాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ప్రతి వారంలో ఒక రోజు అధికారులు హాస్టల్లో నిద్ర చేయాలన్నారు. హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ నిరంతరం విద్యార్దులకు అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్దులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని అన్నారు. అవసరమైన చోట ట్యూటర్స్ ను నియమించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్. కొర్నిలియస్, బిసి సంక్షేమ అధికారి బి. రవీందర్, పిఆర్ ఇంజనీర్స్, హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post