సంక్షేమ హాస్టళ్లు సిద్ధం చేయాలి

ప్రచురణార్థం

సంక్షేమ హాస్టళ్లు సిద్ధం చేయాలి.

మహబూబాబాద్ సెప్టెంబర్ 27.

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లను అన్ని వసతులు కల్పించి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్ల వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 8 ప్రీమెట్రిక్ హాస్టల్స్ 6 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 20 సంక్షేమ హాస్టల్స్ 4 కాలేజ్ హాస్టల్స్ ను అన్ని వసతులు కల్పించి సిద్ధంగా ఉంచాలన్నారు.

విద్యార్థులకు ప్రధానంగా మరుగుదొడ్లు సిద్ధం చేయాలని అదేవిధంగా శీతాకాలంలో వేడి నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి హాస్టల్ కి త్రాగునీటి కొరత ఉండరాదని మిషన్ భగీరథ కనెక్షన్ తీసుకోవాలన్నారు.

ఓబిసి సర్టిఫికెట్ల జారీలో జాప్యం తగదని అధికారులను ఆదేశించారు కులాంతర వివాహాల ప్రోత్సాహకాల పై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు పాల్గొన్నారు.
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post