సంగారెడ్డి జిల్లాలో 8 విడతలుగా రైతుల ఖాతాల్లో 2 వేల 453 కోట్లు జమ…….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

సంగారెడ్డి జిల్లాలో 8 విడతలుగా రైతుల ఖాతాల్లో 2 వేల 453 కోట్లు జమ…….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2, 71, 756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు .

జిల్లాలో తొలి విడత 280 కోట్ల 50 లక్షల 35 వేల 8 వందల రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు,
మూడవ విడతల 297 కోట్ల 78 లక్షల 21 వేల 640 రూపాయలు,
నాలుగవ విడత లో 216 కోట్ల 45 లక్షల 76 వేల 58 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఐదవ విడత లో రూ. 366 కోట్ల 71 లక్షల 8 వేల 450 , ఆరవ విడత రూ. 368 కోట్ల 70 లక్షల 28 వేల 425 , ఏడవ విడత రూ. 366కోట్ల 86 లక్షల 47 వేల 211, ఎనిమిదవ విడత రూ. 288 కోట్ల 40 లక్షల 7 వేల 100 రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జనవరి,12 నాటికి
నియోజక నియోజకవర్గం వారీగా 8 విడతల్లో సరాసరిగా ( average) లబ్ధి పొందిన రైతులు , జమ చేసిన రైతు బంధు మొత్తం రూపాయల వివరాలు:

1. ఆందోల్ – 64657 మంది రైతులు రూ.574.47 కోట్లు

2. నారాయణఖేడ్- 64958 మంది రైతులు రూ.657.02 కోట్లు

3. పటాన్చెరు:- 21497 మంది రైతులు రూ.140.98 కోట్లు

4. సంగారెడ్డి:- 44149 మంది రైతులు రూ.341.04 కోట్లు

5. జహీరాబాద్:- 59692 మంది రైతులు రూ.622.48 కోట్లు.

6. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం :–15802 మంది రైతులు రూ.117.33 కోట్లు.

రైతు బంధు ద్వారా
జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గం రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు.

రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రములో మొత్తం రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. కేవలం నాలుగేండ్లలో రైతులకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం అందజేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కలెక్టర్ పేర్కొన్నారు.

Share This Post