సంగెం మండలంలోని గవిచర్ల, కాపుల కనపర్తి  గ్రామల  లో వ్యాక్సినేషన్  కార్యక్రమన్నీ జిల్లా  కలెక్టర్  గోపి గురువారం   ఆకస్మికంగా పరిశీలించారు

వ్యాక్సినేషన్
స్పెషల్ డ్రైవ్ ను
ఆకస్మికంగా సందర్శించిన   కలెక్టర్ గోపి
సంగెం మండలంలోని గవిచర్ల, కాపుల కనపర్తి  గ్రామల  లో వ్యాక్సినేషన్  కార్యక్రమన్నీ జిల్లా  కలెక్టర్  గోపి గురువారం   ఆకస్మికంగా పరిశీలించారు
ఈ సందర్బంగా గవిచర్ల  గ్రామంలో మొత్తం జనాభా ఎంత…  అందులో మొదటి డోస్ ఎంతమంది తీసుకున్నారు… రెండవ డోస్ ఎందరు తీసుకున్నారని కలెక్టర్  ఆశ  వర్కర్లని అడిగి  తెలుసుకున్నారు
 అనంతరం  వ్యాక్సినేషన్  రిజిస్టర్ను పరిశీలించారు
ఈరోజు మొదటి డోస్ తీసుకున్న వారి పేర్లు రిజిస్టర్లో నమోదు చేశారా… చేస్తే వారి పేర్లను చూపించండి అని కలెక్టర్  అడిగారు
 మొత్తం జనాభా లో  18 సంవత్సరాలు నిండిన వారు ఎంతమంది అని అడగగా 3804 మంది అని ఆశ  వర్కర్లు  తెలిపారు.
వారిలో  మొదటి డోస్ ఎంతమంది తీసుకున్నారు అని అడగగా 2974 మంది వ్యాక్సిన్ వేసుకున్నారని వారు  సమాధానమిచ్చారు .
మిగతా  వారికి
కూడా వ్యాక్సిన్ వేయించాలని  సర్పంచ్ దొనికేల రమ శ్రీనివాస్ కి  సూచించారు
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మహేందర్ జి, ఎంపీపీ కందగట్ల కళావతి,జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో మల్లేశం , తహసిల్దార్ రాజేంద్రనాథ్ , ఎంపీడీవో కొమురయ్య ,మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్, సర్పంచ్ దోనికేల రమ శ్రీనివాస్ , రైతుబంధు మండల అధ్యక్షుడు కందగట్ల నరహరి, ఎంపిటిసి గూడ సంపత్ రెడ్డి, సర్పంచ్ చెన్నూరి యాకయ్య , వార్డు మెంబర్లు,పంచాయతీ కార్యదర్శి సోనా బోయిన కిరణ్ , ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు
.

Share This Post