ప్రెస్ రిలీజ్
జనగాం జిల్లా, నవంబర్- 28.
సంచార జాతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ……………
విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు కేంద్ర సంచార జాతుల అభివృద్ధి బోర్డు సభ్యులు, తురుక.నరసింహ
సోమవారం,నాడు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య,జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బందితో నరసింహ సంచార జాతుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంచార జాతులు వారి జీవన ఉపాధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయని వాటిని పక్కాగా అమలు చేయడానికి సిబ్బంది కృషి చేయాలన్నారు.
ఎస్సీ ,ఎస్టీ, కేసుల విషయంలో విద్య, ఉపాధి, పారిశ్రామిక, ఇలా అనేక యూనిట్లలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జనగామ సీతారాంతో జిల్లాలో ఉన్న సంచార జాతులు గురించి ఎస్సీ, ఎస్టీ కేసుల పెండింగ్ పరిష్కారం తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. విద్యాశాఖ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉత్తమమైన బోధనలు అందించాలని, విద్య ద్వారానే సంచార జాతులు వెనుకబడిన జాతులు వెలుగులోకి వస్తాయని అన్నారు. జనగామ జిల్లా నగరానికి దగ్గరగా ఉన్నందున ఇక్కడ సంచార జాతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అవగాహనతో ఉన్నారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వైద్యం వైద్య ఆరోగ్యశాఖ, ఎస్సీ ,ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ వారిగా నివేదికలు అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు పథకాలు తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు, సంచార జాతులు వెనుకబడిన తరగతులు ఎలాంటి భేదాలు లేకుండా సగర్వంగా ఉండాలని, కేసుల పరిష్కారం దిశగా నిజాయితీగా సేవలు అందించాలని తురక. నరసింహ అన్నారు.
జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, మాట్లాడుతూ జిల్లాలో
సంచార జాతులు వారికి ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు ఎస్సీ ,ఎస్టీ కేసులు ఉపాధి ఇతర పనుల గురించి నరసింహకు కలెక్టర్ వివరించారు.
అంతకముందు కలెక్టర్ ,డీసీపీ, అదనపు కలెక్టర్ నరసింహకు బోకేతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జి. రామిరెడ్డి ,డిఎం అండ్ హెచ్ ఓ ఏ .మహేందర్, డిఈఓ. రాము, ఎస్సీ,బీసీ ,సంక్షేమ అధికారులు కొర్నియాల్, వెంకన్న, బి .రవీందర్, జిల్లా వెల్ఫేర్ అధికారిని జయంతి, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.