సంచార జాతుల అభ్యున్నతికి కృషి స్థితిగతులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలి.: జాతీయ సంచార జాతుల విముక్త మండలి బోర్డ్ సభ్యులు తురక నర్సింహ.

జిల్లాలో సంచార జాతుల అభ్యున్నతికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జాతీయ సంచార జాతుల విముక్త మండలి బోర్డ్ సభ్యులు తురక నర్సింహ అన్నారు.  బుధవారం కలెక్టర్ నందు సంచార జాతుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతుల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను వారికి అందేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న సంచార జాతుల కుటుంబాల పిల్లలకు పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. ముఖ్యాoగా  జిల్లాలో సంచార జాతుల బాధితులకు నష్ట పరిహారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అలాగే ఇంకా చెల్లింపులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని తెలుసుకున్నారు. వివిధ కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.  వడ్డెర కులస్తులకు రాళ్ళ క్వారీ లలో ఎంత మేరకు సదుపాయాలు కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విషయంలో  నాణ్యమైన విద్య, మానవ వనరులు అందిస్తే విద్యార్థులు వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు. త్వరలో జిల్లా లోని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాద్యాయులచే విద్య , మానవ వనరులు, జాతీయ సమైక్యత పై సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే ఉపద్యాయులు నిష్టా  ట్రైనింగ్ లో తరుచుగా పాల్గొనాలని సూచించారు.
   ఈ సమావేశంలో ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, డి.యస్.పి. మోహన్ కుమార్, సంక్షేమ అధికారులు శంకర్, శిరీష, దయానంద రాణి, డి.ఈ. ఓ అశోక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post