సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి-సంచార అర్ద సంచార విముక్త కులాల సామాజిక న్యాయ సాధికారత బోర్డు సభ్యులు శ్రీ.తుర్క నర్సింహ

సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంచార అర్ద సంచార విముక్త కులాల సామాజిక న్యాయ సాధికారత బోర్డు సభ్యులు శ్రీ.తుర్క నర్సింహ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన నిర్వించిన సమావేశంలో సభ్యులు తూర్క నర్సింహ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఏ యే ప్రాంతాల్లో సంచార జాతుల వారు నివసిస్తున్నారు గుర్తించి వారికి అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం నుండి కోవిడ్ మహమ్మారి ప్రజల జీవన విధానాల్లో ఎన్నో మార్పులు తెచ్చిందని అన్నారు. ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంచార జాతుల వారు నివసిస్తున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని , కరోనా టీకాలను వేయించాలని జిల్లా వైద్యాధికారి ని సూచించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గత రెండు సంవత్సరాల్లో ఏమైనా నమోదు అయ్యాయా , నమోదైన కేసులలో నష్టపరిహారం చెల్లించి నట్లయితే సమగ్ర నివేదికను అందించాలని రాచకొండ సైబరాబాద్ పోలీసు అధికారులను ఆదేశించారు. సంచార జాతుల వారు ఏవే నీ నేరాలు చేసిన వారి వివరాలు అందజేయాలని అదేవిధంగా వారికి కౌన్సలింగ్ ఇచ్చి నేర ప్రవృత్తిని తగ్గించాలని, వారికి పునరావాసం కల్పించాలని తెలిపారు.
విద్యార్థులను భావి భారత పౌరుల తీర్చి దిద్దే లా జిల్లాలోని ప్రభత్వ పాటశాలలో బోధన ఉండే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యశాఖాధికారిని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని , దిశ నిర్దేశం గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుపాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యా వ్యవస్థ బాగుంటే మానవ విలువలు బాగుంటాయని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ జే.డి శ్రీదర్ , జిల్లా వైద్యాధకారి స్వరాజ్య లక్ష్మి , విద్యాధికారి విజయ కుమారి , గిరిజన శాఖ అధికారి రామేశ్వరి , రాచకొండ డీసీపీ యాదగిరి , సైబరాబాద్ ఏసీపీ రాంచంద్రారెడ్డి , మైనారిటీ సంక్షేమశాఖ అధికారి రత్న కళ్యాణి , బీ సీ సంక్షేమ శాఖ అధికారి బీ. విద్య ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు తదితరులు పాల్గొన్నారు.

Share This Post