సంయుక్త సర్వే చేపట్టి అటవి, పట్టా భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 సంయుక్త సర్వే చేపట్టి అటవి, పట్టా భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో అటవీ, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలో ఉన్న అటవీ, రెవెన్యూ భూములను సంయుక్త సర్వే చేపట్టి అధికారులు గుర్తించాలని సూచించారు. రైతుల వివాదాలను పరిష్కరించాలని కోరారు. సర్వే ల్యాండ్, అటవి, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామాల వారిగా సర్వే చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ చీప్ కన్జర్వేటర్ వినోద్ కుమార్, డిఎఫ్వో నిఖిత, బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్, అటవీశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post