సంస్కృతి సాంప్రదాయాల తోనే వృద్ధాశ్రమాల నిలువరింత…

ప్రచురణార్థం

సంస్కృతి సాంప్రదాయాల తోనే వృద్ధాశ్రమాల నిలువరింత…

సంస్కృతి సాంప్రదాయాల విలువలను పెంపొందించడంతోనే వృద్ధాశ్రమాల నిలువరింతకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

మహబూబాబాద్ అక్టోబర్ 5.

మంగళవారం మున్సిపల్ పరిధిలోని ఎస్ వి ఎం ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల సంక్షేమ వయో వృద్ధుల సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో 2021 అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభలో మాట్లాడారు వృద్ధాశ్రమాల ఆవశ్యకతను తగ్గించేదిశగా సంస్కృతి సాంప్రదాయాల విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

13 మూడున్నర కోట్ల మంది ఉన్న వృద్ధుల శాతం 2031 నాటికి 20 కోట్లకు పెరగనుందన్నారు.

వృద్ధుల సంక్షేమార్థం 2007 సంవత్సరంలోనే వృద్ధుల భద్రత రక్షణ పోషణ నిమిత్తం చట్టం ఏర్పడిందని ఈ చట్టం ఆవశ్యకత రాకూడదనే 2011 నుండి అమలు చేయడం జరిగిందన్నారు. వృద్ధుల సంక్షేమం కొరకు అసోసియేషన్ చేసిన కృషిని కలెక్టర్ కొనియాడారు.

వృద్ధాశ్రమాలు కొరకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ పై అవగాహన పెంచాలని వైద్య సేవలు బ్యాంకు సేవలు సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావాలన్నారు.

జిల్లాలో 33 వేల మంది వృద్ధులు ఉన్నారన్నారు అలాగే జిల్లాలో 2 వృద్ధాశ్రమాలు ఉండగా ఒకటి మహబూబాబాదులో ని సికింద్రాబాద్ తండా కాగా రెండవది పెద్దముప్పారంలో ఉందన్నారు.

పట్టించుకోని పిల్లల తల్లిదండ్రులు తమ పోషణ అర్థం ఆర్ డి ఓ వద్ద 23 కేసులు ఉండగా 11 పరిష్కరించామని మరో 12 త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

కురవి రోడ్ లో కొత్త కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి ఎదురుగా ఉన్న 600 చదరపు గజాల స్థలంలో వృద్ధాశ్రమం నిర్మించేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ దివ్య దేవరాజన్ 50 లక్షలు మంజూరు చేసినట్లు తెలియజేశారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు అనంతరం వృద్ధుల సంక్షేమం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రమాదేవి ఉప వైద్యాధికారి అంబరీష బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ నాగ వాణి జిల్లా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం వయో వృద్ధులు సంక్షేమం అధికారిని స్వర్ణలత లెనిన్
జిల్లా వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు రుద్రమ్మ ముత్తయ్య గౌరవ అధ్యక్షులు రవీందర్ గుప్తా విశ్వనాథ చారి తదితరులు పాల్గొన్నారు
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post