సకల సౌలతులతో సర్కారు బడి లో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ లో బోధిస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కారు బడికె పంపించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

సకల సౌలతులతో సర్కారు బడి లో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ లో బోధిస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కారు బడికె పంపించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కోరారు. మంగళవారం ఉదయం పెంట్లవెల్లి మండలం, కొండూరు గ్రామంలో జరిగిన మన ఉరు మన బడి, పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సరస్వతి విగ్రహానికి పూజలు చేసి పిల్లలను కలెక్టర్ తన ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయించారు. గ్రామస్థుల కృషితో ఏర్పాటు చేసుకున్న వాలీబాల్ కోర్టు లో వాలీబాల్ ఆడి పక్కనే మొక్కను నాటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బడికి పంపించాలని సూచించారు. ఈ గ్రామంలో ప్రభుత్వం, ఇతర సంస్థలపై ఎక్కువగా ఆధారపడకుండా ప్రజలందరూ కలిసి ఊరిని బాగుచేసుకున్నారని అభినందించారు. పాఠశాలకు స్థలాన్ని కొనుక్కోని క్రీడా ప్రాంగణం చక్కగా తీర్చిదిద్దుకున్నారని కితాబు ఇచ్చారు. ఈ పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉన్నందున మన ఉరు మనబడి కి ఎంపిక చేయబడిందిని, దగ్గరుండి పాఠశాలకు కావాల్సిన మౌళిక వసతులు బాగు చేసుకోవాలన్నారు. హరితహారం లో మొక్కలు ఇంకా బాగా పెంచుకోని ఈ ఉరి పై నాకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని తెలియజేసారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచు గోపాల్ మాట్లాడుతూ కొండూరు వెనుకబడిన గ్రామమని గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ ను కోరారు. పాఠశాలకు ఒక పి.ఈ.టి టీచర్, మరో ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఇళ్ల మధ్యనుండి హైటెన్షన్ విద్యుత్ వైర్లు పోతుండటం వల్ల గ్రామస్తులు ప్రమాదానికి గురి అవుతున్నారని, వాటిని పక్కకు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హనుమ నాయక్, తహసిల్దార్ రమేష్, ఎంపిడిఓ రామయ్య, ఎంపిపి ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share This Post